సిరాన్యూస్,ఆదిలాబాద్
జగ్జీవన్ రాం ఆశయ సాధనకు కృషి చేయాలి : మాజీ మంత్రి జోగురామన్న
మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాలను స్మరించుకుంటూ వారి పోరాట స్పూర్తిని భావితరాలకు తెలియచెప్పాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. స్వాతంత్ర సమర యోధులు బాబు జగ్జీవన్ రాం జయంతిని పురస్కరిచుకుని శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రాం చౌక్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రాం విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. శ్రేణులతో కలిసి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. దేశానికి బాబు జగ్జీవన్ రాం చేసిన సేవలను ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న గుర్తు చేసుకున్నారు. దేశ స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా విశేష సేవలందించారని అన్నారు. గొప్ప సంఘ సంస్కర్త అయిన బాబు జగ్జీవన్ రాం చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, నాయకులు అలాల్ అజయ్, విజ్జగిరి నారాయణ, వేణుగోపాల్ యాదవ్, రాజన్న, అష్రఫ్, భూమన్న కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.