– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సిరా న్యూస్,పెద్దపల్లి;
అటవీ శాఖలో పని చేస్తూ అమరులైన్ వీరులకు జోహార్లు తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బందికి జోహార్లు అర్పిస్తూ అటవీ అమరవీరుల స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం అటవి శాఖ సిబ్బంది చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీశాఖ సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.