సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
బీఆర్ఎస్ నాయకుడు మల్లె మహేష్ అభినందించిన జాన్సన్ నాయక్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ లో బీఆర్ఎస్,పార్టీ సీనియర్ నాయకుడు మల్లె మహేష్‌ను ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్, పార్టీ ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ అభినందించారు. ఇటీవల మల్లె మహేష్ ఏర్పాటు చేసిన తేజస్ బేకరీ టీ పాయింట్‌ను శనివారం భూక్య జాన్సన్ నాయక్ సందర్శించారు. ఖానాపూర్ లో మీ వ్యాపారం అభివృద్ధి దిశగా ముందుకెల్లాలని ఆకాక్షించారు. స్వశక్తి తో ఇలా ముందుకెళ్లడం గొప్ప విషయమని మహేష్ ని అభినందించారు. వారి వెంట ఖానాపూర్ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.