సిరా న్యూస్, గొల్లప్రోలు:
రైతులు అధైర్యపడవద్దు… అండగా ఉంటాం…
– జాయింట్ కలెక్టర్ ఇల్కియానా
మిచౌంగ్ తుఫాన్ వలన నష్టపోయిన గ్రామాలలో జాయింట్ కలెక్టర్ ఇల్కియానా గురువారం పర్యటించారు. ఈ సందర్బముగా రైతులతో మాట్లాడి, వారి ఇబ్బందులు అడిగి తెల్సుకున్నారు. రైతులు ఆధైర్యపడవద్దని త్వరలోనే పంట నష్టం సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే వర్మా పరామర్శ…
గొల్లప్రోలు మండలంలో మిచౌంగ్ తుఫాన్ వలన నష్టపోయిన గ్రామాలలో గురువారం మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన వన్నెపూడి గ్రామంలో రైతులతో కలిసి మునిగిపోయిన పంటలను పరిశిలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గొల్లప్రోలు మండలం కొడవలి, చెందుర్తి, వన్నెపూడి, తాటిపర్తి, మల్లవరం గ్రామాల్లో, యు.కొత్తపల్లి మండలంలో కుతుకుడుమిల్లి, పిఠాపురం మండలం పి.దొంతమూరు, తిమ్మాపురం గ్రామాలతో పాటు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో వరి చేనులు నీట మునిగామని అన్నారు. ధాన్యం కూడా బాగా తడిచిపోయిందని, ధాన్యం కొనే నాధుడు కనపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ ఇల్కియానాకీ కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఈ గ్రామాలతో పాటు తాటిపర్తి, చేబ్రోలు, వన్నెపూడి, చిన్న జగ్గంపేట,చెందుర్తి, గ్రామలు అన్నింటిలో మినప, జొన్న, దొండ పాదులు, కాకర కాయ, పత్తి చేనులు మొత్తం దెబ్బతిన్నాయని అన్నారు. నష్ట పోయిన పంటలకు ఎకరానికి రూ . 50 వేల నష్ట పరిహారం ప్రభుత్వం అందించాలని, వరి పంటకు ఎకరాని 30 వేలు ఇవ్వాలని పిఠాపురం తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర్ రావు,సకుమళ్ళ గంగాధర రావు, ఉలవకాయల దేవేంద్రుడు, మడికి ప్రసాద్, దేవరపల్లి రామారావు, నల్లా శ్రీను, నుతాటి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.