సిరాన్యూస్,బేల
కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మిద్దాం : జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు
* బేలలో కుష్ఠు వ్యాధిపై అవగాహన సదస్సు
కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మిద్దామని జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమూనా సర్వే కమ్ అసెస్మెంట్ హైదరాబాద్ టీమ్ ఆధ్వర్యంలో కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి కృష్ణ వంశీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు ఆశ వర్కర్లతో సమావేశం ఏర్పాటు చేసి కుష్ఠు వ్యాధి పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్పర్శ లేని,రాగి రంగులో ఉండే మచ్చ వున్నచో సంబంధిత ఆశా,ఏఎన్‌ఎం లను సంప్రదించాలని సూచించారు. వ్యాధి గురించి ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు. కుష్టు రహిత భారత దేశాన్ని తొందరలోనే చూస్తామన్నారు. ఆశా వర్కర్లు ఈ వ్యాధిపై అవగాహన పెంచుకొని,అపోహలు లేకుండా వ్యాధిగ్రస్తులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. ఒకవేళ ఎవరికైనా 5 లోపు మచ్చలు ఉంటే 6 నెలలు,5 కన్న ఎక్కువ మచ్చలు ఉంటే సంవత్సరం పాటు ప్రభుత్వం వారికి మందులను ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. బేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డుల నిర్వహన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ,సకోలా రెడ్డి, వెంకటేశ్వరా చారీ డి పి ఎం ఓ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.