సిరాన్యూస్,ఆదిలాబాద్
సీనియర్ పాత్రికేయులు సందేశ్ భరద్వాజ్ కి హిందీ సేవా సమితి సన్మానం
హిందీ డైలీ పత్రిక సంపాదకులు సందేశ్ భరద్వాజ్ ను సత్యశోధక సమాజ స్థాపన 151 వ దినోత్సవాన్ని పురస్కరించుకొని హిందీ భాషా సేవా సమితి ఆదిలాబాద్ జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సందేశ్ భరద్వాజ్ మాట్లాడుతూ హిందీ భాషాభివృద్ధి కోసం హిందీ భాష సేవా సమితి సభ్యులు గత పది సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం హిందీ దినోత్సవాన్ని జిల్లా స్థాయిలో జరుపుతూ సాహితీవేత్తల్ని, హిందీ భాషా ప్రేమికుల్ని, హింది పండితుల్ని, విద్యార్థిని విద్యార్థులని ఒక్కదాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ హిందీ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ సందేశ్ భరద్వాజ్ ఆదిలాబాద్ జిల్లాలో హిందీ పత్రికను ప్రారంభించి అనతి కాలంలోనే హిందీ దినోత్సవం రోజు దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్న హిందీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ వాణిని దేశ రాజధాని నగరం ఢిల్లీలో వినిపించి ఇటు ఆదిలాబాద్ అటు హిందీ యొక్క పేరు ప్రతిష్టల్ని దేశవ్యాప్తంగా చేసినందుకు ఆయన్ని ఘనంగా సన్మానించడం జరిగిందని అన్నారు. బౌద్ధ మహాసభ , మాలీ మహా సంఘం తరఫున ప్రముఖ సాహితీవేత్త మధుబావల్కర్ సాంబన్న శేన్డే సందేశ్ భరద్వాజిని శాలువా మెమోంటోతో సత్కరించారు. కార్యక్రమంలో సేవాసమితి సభ్యులు సుకుమార్ పెట్కులే, సాంబన్న షిండే, చంద్రశేఖర్ అంబేకర్, జావేద్ అలీ తదితరులు పాల్గొన్నారు.