సిరాన్యూస్, సామర్లకోట
జోరుగా బీజేపీ సభ్యత్వ కార్యక్రమం : బీజేపీ కాకినాడ జిల్లా ఇన్చార్జ్ రావూరి సుధా
పెద్దాపురం నియోజక వర్గంలోని సామర్లకోట ,కోదండరామ పురం లో జోరుగా బీజేపీ సాధారణ సభ్యత్వ కార్యక్రమం జరుగుతుందని బీజేపీ కాకినాడ జిల్లా ఇన్చార్జ్ రావూరి సుధా అన్నారు.మంగళవారం సామర్లకోట పట్టణంలో బళ్ళ మార్కెట్ సెంటర్లో, కోదండరామపురం కాలనీలోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం కాకినాడ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇన్చార్జి రావూరి సుధ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కాకినాడ జిల్లా ఇన్చార్జ్ రావూరి సుధా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా దేశం మొత్తం మీద చేపట్టడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిలిగడ్డ గంగరాజు , పెద్దాపురం నియోజకవర్గ సభ్యత నమోదు ఇంచార్జ్ డాక్టర్ గోరకపూడి చిన్నయ్య దొర , కాకినాడ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏడిద కృష్ణ, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు బక్కి వీర్రాజు, సంకవల్లి బాపిరాజు, వల్లూరు బుల్లయ్య, పెన్నాడ జగన్నాథం, యేలేటి రమేష్, మమ్ముట్టి సత్తి బాబు,భక్కీ విజయ్ కుమార్, కొల్లి కీర్తి రత్న, కృష్ణం రాజు, వీర ప్రకాశరావు, భార్గవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.