సిరా న్యూస్,హైదరాబాద్;
కలకత్తా లో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటనను నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బంద్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ముందు జూడాలు నిరసనకు దిగారు. జస్టిస్ ఫర్ ఆర్జీ కర్ పేరిట నిర్వహించిన నిరసనలో జూడాలు పెద్దయెత్తున పాల్గొన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నృత్యరూపకంగా జూడాలు ప్రదర్శించారు. జూనియర్ డాక్టర్ పై పాశవికంగా వ్యవహరించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు