jyoshika, Kaushik: పుట్టినరోజు వేడుకలు వద్దు… నిరుపేదలకు సహాయం చేయండి 

సిరాన్యూస్, ఓదెల
పుట్టినరోజు వేడుకలు వద్దు… నిరుపేదలకు సహాయం చేయండి 
పొడిశెట్టి రాజేశ్వరికి వీల్ చైర్ అందించిన చిన్నారులు జ్యోషిక, కౌశిక్

పెళ్ళిరోజు వేడుకలు, పుట్టినరోజు వేడుకలు వద్దంటూ ..ఆ డబ్బులతో నిరుపేదలకు సహాయం చేస్తున్నారు చిన్నారులు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన పొడిశెట్టి రాజేశ్వరి అంగవైకల్యంతో బాధపడుతుంది. ఈవిష‌యాన్ని టీవీలలో, పేపర్లో సుల్తానాబాద్ మున్సిపాలిటీ ద్వారాకనగర్ లో నివాసముంటున్న ఏగోలపు సదయ్య గౌడ్ కూతురు జ్యోషిక (17),కౌశిక్ (16) చిన్నారులు చూసి చలించిపోయారు. గురువారం దాత సుల్తానాబాద్ శివాలయం చైర్మన్ అల్లెoకి సత్యనారాయణ దంపతుల సహాయంతో పొడిశెట్టి రాజేశ్వరికి వీల్ చైర్ అందించారు. ఈసంద‌ర్భంగా చిన్నారులు ఏగోలపు జ్యోషిక, కౌశిక్ లు మాట్లాడుతూ మేము గత నాలుగు సంవత్సరాలుగా పుట్టినరోజు వేడుకలు, డిసెంబర్ 31 వేడుకలు వద్దని చేస్తున్న కార్యక్రమాలు చూసిన సుల్తానాబాద్ శివాలయం చైర్మన్ అల్లెoకి సత్యనారాయణ-భాగ్యలక్ష్మిల గురువారం పెళ్ళిరోజూ సందర్భంగా మమ్మల్ని ప్రోత్సహించి మంచి ప్రోగ్రాం చేయమని చెప్పారు. వారికి కోలనూర్ గ్రామంలో అంగవైకల్యంతో నడవడానికి ఇబ్బంది పడుతున్న పొడిశెట్టి రాజేశ్వరి గురించి చెప్పి విల్ ఛైర్ అడిగాము.వారు వెంటనే స్పందించి విల్ ఛైర్ కొనిచ్చారు. పెద్దవారికీ , యువతకు మేము ఛాలెంజ్ చేస్తున్నాము, పెళ్ళిరోజు వేడుకలు, పుట్టినరోజు వేడుకలు, డిసెంబర్31 వేడుకలు వద్దని మీరు ఆ వేడుకల కోసం ఖర్చు పెట్టె డబ్బులను నిరుపేద కుటుంబాలకు సహాయం చేయాలని వేడుకున్నారు. 2020 లాక్ డౌన్లో వీరు దాచుకున్న డబ్బులు, దాతల సహాయంతో 207 మంది నిరుపేద కుటుంబాలకు, సెప్టెంబర్ నెలలో టీచర్స్ డే సందర్భంగా200 మంది ప్రయివేటు ఉపాద్యాయులకు మొత్తం 407 మందికి ఒక్కొక్కరికీ 500 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను అందించారు.ఈ కార్యక్రమంలో బొడ్ల శ్రీనివాస్, అల్లెoకి అరుణ్,మిర్జా అమిన్ బేగ్, బైరి రవీందర్ గౌడ్, పుల్ల సత్యనారాయణ, బండారి ఐలయ్య, ముంజాల బాబు, సాతూరి రవి,పోతుగంటి రాజు గౌడ్,మార్క శ్రీనివాస్ గౌడ్,వస్త్రం నాయక్, రాస సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *