సిరాన్యూస్, ఓదెల
మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్నితనిఖీ చేసిన సీఈవో కె.నరేందర్
ఓదెల మండల ప్రజా పరిషత్ కార్యాలయ్యాన్ని గురువారం సీఈఓ కె. నరేందర్ ఆకస్మికముగా తనఖీ చేశారు. అనంతరం ఎంపీడీఓ, ఎంపీఓ, ఏఈఈ మిషన్ భగీరథ , కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున గ్రామ పంచాయతీలలో ఎక్కడ కూడ నీటి సమస్య రాకుండా చూడాలని, సమస్య ఉంటే ముందుగా గుర్తించాలని, మార్కెట్ల, సంతల దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. మానేరు పరివాహములలో వున్న గ్రామ పంచాయతీ లలో ఎక్కువ గా దృష్టి పెట్టి నీటి సమస్య రాకుండా చూడాలని తెలిపారు. ఒకవేళ అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి యొక్క శాఖ ప్రజల కోసం పనిచేస్తుందని నా శాఖ కు సంబందించిన పని కాదు అని ఏ ఒక్క మండల స్థాయి అధికారి అనుకోవద్దు అందరూ కలిసి కట్టుగా పని చేయాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగముగా ప్రతి స్కూల్ తిరిగి సమస్యలు గుర్తించి ఎస్టిమేషన్ తీసుకోని త్వరగా పంపాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జి తిరుపతి, కార్యాలయ పర్యవేక్షకులు జి శ్రీధర్, ఏఈఈ మిషన్ భగీరథ బి స్రవంతి, మండల పంచాయతీ అధికారి కె భాస్కర్, కార్యాలయ సిబ్బంది ప్రసాద్ వెంకటేశ్వర్లు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.