సిరా న్యూస్ : రాజన్న సిరిసిల్ల
తెలంగాణ యువ క్రికెటర్లపై కేటీఆర్ కే టి ఆర్ ప్రశంసలు..
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్ 19 ప్రపంచకప్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ.. పంజాబ్ బ్యాటర్ ఉదయ్ సహారన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈ జట్టులో ఇద్దరు తెలంగాణ యువకులు ఆరవెల్లి అవనీష్ రావు, మురుగన్ అభిషేక్ చోటు దక్కించుకున్నారు.ప్రపంచ కప్ జట్టులో తెలంగాణ యువకులు చోటు దక్కించుకోవడంపై రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వీరిద్దరూ కెరీర్‌లో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.మన పోత్గల్ కుర్రాడు..
దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ , ట్రై సిరీస్‌లకు ఎంపికైనందుకు ఆరవెల్లి అవనీష్ రావు(వికెట్ కీపర్/ బ్యాటర్)కు హృదయపూర్వక అభినందనలు.ఈ యువ క్రికెటర్ మన రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలం పోతగల్ గ్రామానికి చెందిన కుర్రాడు’ అని కేటీఆర్ అతన్ని తనదైన స్టైల్‌లో మెచ్చుకుంటూ విష్ చేశారు…