సిరా న్యూస్, సైదాపూర్
రానున్న వర్షాకాలంలో ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలి: ప్రత్యేక అధికారి కె. విజేందర్
రానున్న వర్షాకాలంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వెన్నంపల్లి గ్రామ స్పెషల్ ఆఫీసర్ కె.విజేందర్ అన్నారు. గురువారం సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు వారి ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షపు నీరు నిలువకుండా చూడాలన్నారు. చెత్త చెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ నరేందర్ రెడ్డి, కారోబార్ రాజేందర్, ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.