సిరాన్యూస్, బోథ్
చలో ఐటీడీఏ ధర్నాను విజయవంతం చేయండి: తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కడప నగేష్
షెడ్యూల్ ప్రాంతంలో మెగా స్పెషల్ డీఎస్సీ ఏర్పాటు చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఐటీడీఏ లో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఆదివాసి గిరిజనులు విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కడప నగేష్ డిమాండ్ చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతేగాక జీవోఎంఎస్ మూడును యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పోడు భూములు సాగు చేస్తున్న రైతులందరికీ పట్టాలు ఇవ్వాలన్నారు. జాతి కోసం జాతి భవిష్యత్తు కోసం చేపడుతున్న ఈ ధర్నా కార్యక్రమాన్ని ఆదివాసీలందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు పురుక బాపూరావు, ఉపాధ్యక్షులు రా మెల్లి భోజన్న, తుడుం దెబ్బ డివిజన్ ఉపాధ్యక్షులు కురుమే రాజన్,న జేఏవైఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆడే హనుమంతు, నాయకులు చెడుమకి సీతారాం కనక గణేష్, తదితరులు పాల్గొన్నారు.