సిరాన్యూస్, కడెం
కడెంలో ఆంజనేయ స్వాముల ర్యాలీ
నిర్మల్ జిల్లాలోని కడెం మండల కేంద్రంలోని హిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆంజనేయ స్వాముల, భక్తుల బైక్ ర్యాలీ పాండ్వాపూర్ హనుమాన్ టెంపుల్ నుండి కడెం, పెద్దూర్ హనుమాన్ టెంపుల్ వరకు ర్యాలీ కొనసాగించారు. ఇందులో చాలా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ గ్రామాల వీధుల గుండా పెద్ద ఎత్తున జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ బైక్ ర్యాలీ కొనసాగించారు. ఇందులో హిందూ పరిషత్ భజరంగ్ దళ్ వ్యవస్థాపకులు అమరవీని రవి గౌడ్ , జక్కుల సత్తన్న, సకినాల ప్రవీణ్ , రవీందర్ రెడ్డి , చిట్టేటి గణేష్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.