సిరాన్యూస్, కడెం
కడెంలో ఘనంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు
నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని కడెం -పెద్దూర్ లో గల సాయిబాబా ఆలయంలో సోమవారం 12 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సాయినాధుని హారతితో మొదలై, హోమం, మహా అన్నదానం , సాయంత్రం సాయిబాబా పల్లకి సేవ తో కార్యక్రమం ముగుస్తుందని ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు రమేష్ ఆచార్య తెలిపారు ఆలయం వద్ద జాతరకు భక్తులు అధిక అధిక సంఖ్యలో పాల్గొని సాయినాధునికి ముడుపులు చెల్లించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.