సిరాన్యూస్, కడెం
కడెంలో ఫ్రీ బస్ టికెట్ రద్దు చేయాలని ఆటో డ్రైవర్లు ఆందోళన
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యంతో తమ ఉపాధి దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. ఈసందర్బంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ఈ పథకంతో తమ బతుకు దెరువు దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మా కుటుంబం రోడ్డున పడుతుందని వాపోతున్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లక్ష రూపాయల పైన జాబ్ ఉన్న మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం చేస్తున్నారని తెలిపారు. అనవసరంగా కొంతమంది ఆడవాళ్లు టైంపాస్ కోసం కూడా ఆధార్ కార్డు పట్టుకుని బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు రద్దు చేయాలని కోరారు.