సిరాన్యూస్,ఇచ్చోడ
ఏఐటీయూసీ శిక్షణ తరగతులు: ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో ఈనెల 27, 28 తేదీలలో ఏఐటీయూసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఏఐటీయూసీ ఇచ్చోడ మండల ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండల అధ్యక్షులు, కార్యదర్శులు ఈ శిక్షణ తరగతులకు హాజరుకావాలని కోరారు.