సిరా న్యూస్,వికారాబాద్ జిల్లా;
వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పీరంపల్లిలో కల్తీ కల్లు కలకలం రేపింది. గ్రామంలో కల్తీకల్లు తాగిన పదిమందికి వాంతులు… విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పట్టించుకోక పోగా ఉస్మానియాకు వపంపించారు. దీంతో చేసేది ఏమీ లేక వికారాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి చికిత్సలు పోందుతున్న బాదితులు. ప్రస్తుతం అస్వస్థతకు గురయిన వారందరూ క్షేమంగా ఉండడంతో ఊపిరి పిల్చుకున్న బంధువులు. ఈ ప్రాంతంలో ప్రతి సారి కల్తీ కల్లు తాగి ప్రజలు అస్వస్థతకు గురవుతున్న ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో కల్తీ కల్లు అమ్ముతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలకు డిమాండ్ చేస్తున్నారు.