సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
కాల్వశ్రీరాంపూర్లో పంటపొలాలకు నీటి విడుదల
* ఎమ్మెల్యే విజయరామణారావు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
ఎండలు మండుతున్న వేళ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో వరి పొలాలు, పత్తి పంటలకు ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. నీరు కావాల్సిన సమయంలో వ్యవసాయ బావులు లేని వాళ్లకు కెనాల్ నీళ్లపైన ఆధారపడిన రైతులకు ఎమ్మెల్యే విజయరామణారావు సరైన సమయంలో కెనాల్ ద్వారా నీళ్లు వదిలి రైతులను ఆదుకున్నాడు. చాలా మంది రైతులు కెనాల్ నీళ్ల పైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. కౌలు రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం కెనాల్ నీళ్ళుచ్చి మాట నిలుపుకున్నారని ఈసందర్బంగా రైతులు విజ్జన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.