సిరాన్యూస్,కాల్వ శ్రీరాంపూర్
కాల్వ శ్రీరాంపూర్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ తదితర కార్యాలయాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్నిమంగళవారం నిర్వహించారు. ఈసందర్బంగా మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కలికోట రామ్మోహనచారి, రెవెన్యూ కార్యాలయంలో ఇంచార్జి తహసీల్దార్ జెండా ఎగరావేశారు. గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు జెండా ఎగరావేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గోవర్ధన్, ఏపీఓ మంజుల, సింగిల్ విండో చైర్మెన్ చదువు రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గజానావేన సదయ్య, టెక్నీకల్ అసిస్టెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ హుసేన్, మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.