సిరా న్యూస్, సైదాపూర్
కన్నుల పండగలా లక్ష్మీ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో గురువారం ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది.గ్రామస్థులంతా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవంలో పద్మశాలి ఆడబిడ్డ పద్మావతి దేవి అమ్మగారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు పద్మశాలి కుల భాంధువులు సమర్పించారు.ఈ కార్యక్రమంలో దేవుని యొక్క గొప్పతనం మరి దేవుని యొక్క ప్రవచనాలు ప్రధాన అర్చకులు భక్తులకు గీతాపోదేశం చేశారు.శనివారం రోజున రథంపై స్వామివారి ఊరేగింపుగా వెళ్తారని, ఆదివారం రోజున గ్రామ సంరక్షణర్థం సుదర్శన యాగం ఉంటుందని, సోమవారం పౌర్ణమి హోలీ పండుగ రోజున కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ముగుస్తుందని ప్రధాన అర్చకులు తెలిపారు.స్వామివారి కల్యాణోత్సవం రానున్న కాలంలో ఇంకా అద్భుతంగా జరిపిస్తామని జిల్లాలోని లక్ష్మీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ప్రధాన అర్చకులు భక్తులు పాల్గొన్నారు.