సిరాన్యూస్, కళ్యాణదుర్గం
పెళ్లి కోసం దాచి ఉంచిన నగదు, బంగారం చోరీ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో చాకలి ఆదినారాయణ కుమారుడు పెళ్లి కోసం దాచి ఉంచిన 2,62,500 నగదు, మూడు తులాల బంగారం చోరి చేసిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి భార్యాభర్తలు ఇంటిపై నిద్రిస్తున్న సమయంలో పక్కా పథకం ప్రకారం దుండగులు తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడ్డారు. బీరువాలో దాచి ఉన్నరూ. 2,62,500 నగదుతో పాటు ఒక జత కమ్మలు, ఒక చైను దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు చాకలి ఆదినారాయణ తెలిపారు.వచ్చేనెల కుమారుని వివాహం కోసం డబ్బు బంగారాన్ని ఇంట్లో భద్రపరుచుకున్నారు. ఈ ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.