Kamai Bajirao Baba Saptha: కామాయి లో ముగిసిన సప్తా వేడుకలు

సిరా న్యూస్, జైనథ్:

కామాయి లో ముగిసిన సప్తా వేడుకలు

+ ఘమంగా పల్లకి శోభాయాత్ర

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కామాయి గ్రామంలో సంత్ సద్గురు బాజీరావు బాబా సప్తా ముగింపు వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం నుండే బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి, బంతిపూలతో అలంకరించిన పల్లకిలో ప్రతిష్టించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బాబా పల్లకితో శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భజనలు, కీర్తనలు గావించారు. దేవతా వేషధారణలో ఉన్న చిన్నారులను రథంపై ప్రతిష్టించి పల్లకి వెంట నడిపించారు. అనంతరం భక్తుల కోసం మహా అన్నదానం ఏర్పాటు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *