సిరా న్యూస్,కౌతాళం;
శ్రీరామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమమును పురస్కరించుకొని శోభాకృత నామ సంవత్సరం ఉత్తరాయణం ద్వాదశి సోమవారము రోజున. శ్రీరామ జన్మస్థలం అయోధ్యలో శ్రీరామ నూతన దేవాలయం మరియు శ్రీ సీతారాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని రాజనగర్ క్యాంపు లో శ్రీ రామ ఆలయంలో అష్టవ దాన సదానంద శాస్త్రి జ్యోతిష్కులు వారి ఆధ్వర్యంలో స్వామివారికి జలాభిషేకము పంచామృతాభిషేకము వస్త్రాభరణం పూల అలంకరణ ధుప దీప నైవేద్యము సమర్పించి. స్వాములవారిని పూజలు నిర్వహించారు. శ్రీరామ ప్రవచనాలు ఆంజనేయ స్వామి వారి మహిమలు మరియు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల వైభవంగా జరిపించారు శ్రీ సీతారాములుగా వెంకటపతి రాజు మరియు వారి సతీమణి మణి దంపతులుగా కూర్చున్నారు.మధ్యాహ్నం వచ్చిన భక్తాదులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు .మరియు సాయంకాలం నాలుగు గంటల నుండి 7 గంటల వరకు శ్రీరామ దేవాలయము నుండి పురా వీధుల్లో శ్రీ సీతారాముల ,శ్రీ ఆంజనేయ స్వామి, లక్ష్మణ ,విగ్రహాలను ఊరేగించారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ నాయకులు వెంకటపతి రాజు, గణపతి రాజు, నరసింహా రాజు, శ్రీను, పెద్ది రాజు,సత్యనారాయణ రాజు.దాట్ల సుబ్బరాజు ,సుబ్రహ్మణ్యం రాజు వెంకట రామరాజు , డాక్టర్ రాజా నందు మరియు గ్రామ ప్రజలు ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు శ్రీ సీతారామ ఆలయంలో ప్రసాదములు మరియు టెంకాయను సమర్పించారు. వచ్చిన భక్తులకు రామాలయం తరఫున ఫల హారములు మరియు ప్రసాదములు అందించారు.