సిరా న్యూస్,కామారెడ్డి;
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని ఖండిస్తూ కామారెడ్డి పట్టణ బంద్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ కొనసాగుతుంది. ఈ బంద్ లో భాగంగా వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు షాపింగ్ మాల్ లు పెట్రోల్ బంకులు, పలు వర్తక, వాఙ్ణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ బంద్ కు ప్రజల నుంచి పూర్తిగా మద్దతు లభించింది. ఈ బంద్ కారణంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు లింగం మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నేడు కామారెడ్డి పట్టణ బంద్ కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. ఈ బంద్ కు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంస్థలు, పలు దుకాణాలు, ప్రైవేట్ పాఠశాలు స్వచ్చందంగా బంద్ లో పాల్గొన్నట్టు తెలిపారు. భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ వ్యాపారస్తులు పాల్గొన్నారు.