సిరా న్యూస్, శంకరపట్నం
జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్
* ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
* వినతులు ఇచ్చిన పట్టించుకోని పాలకులు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పలుమార్లు వినతులు ఇచ్చిన పాలకులు పట్టించుకోవడం లేదని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.శంకరపట్నం మండల అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మండలంలో జూనియర్ కళాశాల, గురుకుల హాస్టల్ ను మంజూరు చేయాలని గత ప్రభుత్వ ఎమ్మెల్యే ను, ప్రస్తుత ఎమ్మెల్యే ను కోరడం జరిగిందని తెలిపారు. కానీ వారినుండి ఇప్పటీవరకు సరైన స్పందన లేదని అన్నారు. శంకరపట్నం మండల కేంద్రంలో సుమారు 25 గ్రామాల నుండి నిరుపేద విద్యార్థులు పదవతరగతి ఆపై చదువులకు దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని, సరిగా బస్సులు అందుబాటులో లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం వల్ల విద్యార్థులకు ఏ మాత్రం ప్రయోజనం జరగలేదని విద్యార్థులను విస్మరించిన ప్రభుత్వంగా బీఆర్ఎస్ పార్టీ మిగిలిపోయిందని అన్నారు. ఇప్పుడు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైన విద్యార్థులకు పట్టించుకోవాలని ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందించి మండలంలో జూనియర్ కళాశాల, గురుకుల హాస్టల్ ను మంజూరు చేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారవుతారని తెలిపారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.