సిరా న్యూస్, రాజన్న సిరిసిల్ల
ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి : బీఆర్ఎస్‌వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. గురువారం , రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.విద్య సంవత్సరము ప్రారంభం అయినా కూడా ఇప్పటి వరకు విద్య వ్యవస్థను పట్టించు కున్న పాపాన పోలేదన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చి పేద, బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేస్తాం అని ఏ విధంగా అయితే చెప్పారో వాటిని వెంటనే అమలు అయ్యేలా చూడాలన్నారు. నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించక పోవడం చాలా దురదృష్టం అని అన్నారు . ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యల మీద దృష్టి పెట్టీ వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలలో పాఠ్య పుస్తకాలు అమ్మవద్దు అని చెప్పిన కూడా కొన్ని పాఠశాల లో అమ్ముతున్నారు అని, ఆ పాఠశాల ల మీద అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.