సిరాన్యూస్, భీమదేవరపల్లి
దివ్యాంగులకు స్మతా సబర్వాల్ క్షమాపణ చెప్పాల్సిందే: అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్
దివ్యాంగుల పట్ల ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ అసభ్యంగా మాట్లాడిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం భీమదేవరపల్లి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకుని విధుల నుండి సస్పెండ్ చేయాలన్నారు. ఒక ఉన్నతమైన బాధ్యతగల ఆఫీసర్ గా ఉండి, దివ్యాంగులపై ఇబ్బందికర మాటలు మాట్లాడడం ఆమె సంస్కారానికి నిదర్శనం. దివ్యాంగులుగా ఉన్నవారిలో అనేకమంది మేధావులు ఉన్నారని, చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించి, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు ఉన్నారని తెలపిఆరు. అంగవైకల్యానికి జ్ఞానానికి సంబంధం లేదని, ఎదుటివారి జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయడం సరికాదని మండిపడ్డారు. తక్షణమే ఆమె క్షమాపణలు చెప్పని ఎడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధపడతామని హెచ్చరించారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.