Kandi Mauna Srinivasa Reddy: ఘనంగా కంది మౌన శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకలు

సిరాన్యూస్,ఆదిలాబాద్:
ఘనంగా కంది మౌన శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకలు
* భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులు, మిత్రులు, శ్రేయోభిలాషులు

ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రజా సేవ భవన్ లో సందడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి సతీమణి కంది మౌన శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆమెకు శాలువాలు, పూల బొకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరి మధ్య ఇలా జన్మదిన సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని కంది మౌన శ్రీనివాస రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ముఖ్య నాయకులూ, కార్యకర్తలు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభిమానులు పాల్గొన్నారు.

వేడుకల్లో న్యాయవాది అజయ్…

కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది అజయ్ జోండలే కంది మౌన శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మౌనా రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *