సిరాన్యూస్,ఆదిలాబాద్
పేదల ఆకలి తీర్చడం లో ఎంతో తృప్తి ఉంది – కంది మౌనా శ్రీనివాస రెడ్డి
* నిత్యాన్న దాన కేంద్రం సందర్శన
* స్వయంగా వడ్డించిన కంది శ్రీనివాస రెడ్డి సతీమణి
* మూడేళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుందని వెల్లడి
పేదల ఆకలి తీర్చడం లో ఎంతో తృప్తి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ ప పట్టణంలోని కెఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నిత్యాన్న దాన కేంద్రాన్నిఆమె సందర్శించారు. వంటగదిని పరిసరాలను పరిశీలించారు. కేంద్రానికి వచ్చిన నిరుపేదలకు స్వయంగా వడ్డించారు. రుచి శుచి చక్కగా ఉన్నాయని వారు ఆమె తో తెలిపారు. పది మందికి అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదని అలాంటి మంచి ఆలోచన కలిగిన గొప్ప నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అని భోజనం చేసిన వారు కొనియాడారు. మూడేళ్ల క్రితం పేదల ఆకలి తీర్చాలన్న మంచి లక్ష్యంతో ఆదిలాబాద్ గడ్డపై తన భర్త కంది శ్రీనివాస రెడ్డి నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దానిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారని మౌనా శ్రీనివాస రెడ్డి చెప్పారు. ప్రతిరోజూ వందలాది మంది ఆకలి తీర్చుతుండడం తమ కెంతో తృప్తినిస్తుందన్నారు. వాళ్ళ ఆశీస్సుల తోనే ఇలా నిరంతరాయంగా నిత్యాన్న దాన కేంద్రాన్ని నడిపించ గలుగుతున్నామన్నారు.