సిరా న్యూస్, ఆదిలాబాద్
సీఎంను కలిసిన కంది శ్రీనివాస రెడ్డి
ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి జిల్లా ముఖ్యనేతలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి నివాసాన్ని సందర్శించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గల సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఆయనతో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలు, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వాటికి సీఎం సానుకూలంగా స్పందించారు. అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్‌రెడ్డి వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి సీతక్క, డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ ఆశవాహ అభ్యర్థి ఆత్రం సుగుణ, తదితరులు పాల్గొన్నారు.