Kandi Srinivasa Reddy: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం…

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్‌ పార్టితోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్‌ పార్టి ఆదిలాబాద్‌ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని మేడిగూడ–కే గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకులు తుడుం రాములు ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రాగా, వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందు గ్రామస్తులు ఆయనకు మంగళ హారతులు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రేస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గ్యారెంటీలకు ఆకర్షితులైన భారీ ఎత్తున నాయకులు కాంగ్రెస్‌లోకి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్‌ అడ్డి భోజారెడ్డి, నాయకులు తుమ్మల వెంకట్‌ రెడ్డి, గిమ్మ సంతోష్, బాయిన్‌వార్‌ గంగారెడ్డి, మంచికట్ల ఆశమ్మ, సురేందర్‌ రెడ్డి, నగర్కర్‌ శంకర్, పెందూర్‌ మోహన్, పెందూర్‌ తానాజీ, రతన్‌ రెడ్డి, భూమన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *