Kandi Srinivasa Reddy: అభ్య‌ర్ధుల గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాలి :  కంది శ్రీ‌నివాస రెడ్డి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
అభ్య‌ర్ధుల గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాలికంది శ్రీ‌నివాస రెడ్డి
* ప్ర‌జా సేవాభ‌వ‌న్ లో చేరిక‌ల సంద‌డి

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సాగుతున్న మంచి ప్ర‌జా పాల‌న , ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు చూసి ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీ వైపు ఆక‌ర్షితుల‌వుతున్నార‌ని, అందుకే ఎక్క‌డ చూసినా జోరుగా పార్టీలో చేరుతున్నార‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. ప్ర‌జాసేవాభ‌వ‌న్ లో నిర్వ‌హించిన చేరిక‌ల కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు. మాజీ జ‌డ్పీటీసీ రాందాస్ నాక్లే , విలాస్ ప‌టేల్ ఆధ్వ‌ర్యంలో బేల మండ‌లం లోని కాప్సీ గ్రామం నుండి ప‌లువురు గ్రామ‌స్తులు పార్టీ పై అభిమానంతో కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యానికి త‌ర‌లివ‌చ్చారు. వారంద‌రు కంది శ్రీ‌నివాస రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంద‌రికి కండువాలు క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంద‌న‌డానికి 100 రోజుల పాల‌నే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. 10 ల‌క్ష‌ల ఆరోగ్య శ్రీ బీమా ,మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్, 500 రూపాయ‌ల‌కే గ్యాస్ సిలిండ‌ర్, ఇల్లు క‌ట్టుకోవ‌డానికి 5ల‌క్ష‌ల ఆర్థిక సాయం లాంటి గ్యారెంటీ హామీలిచ్చి 100 రోజుల్లోనే అమ‌లు చేసిన ఘ‌న‌త కాంగ్రెస్ స‌ర్కార్ ది అన్నారు. బీజేపీ ప్ర‌భుత్వం గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌కు 1200 ల‌కు పైగా పెంచి పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటంబాలపై పెను భారం మోపితే కాంగ్రెస్ ప్ర‌భుత్వం 500 ల‌కే గ్యాస్ సిలిండ్ అందిస్తూ వారి జీవితాల్లో మ‌ళ్లీ వెలుగులు తీసుకు వ‌చ్చింద‌న్నారు. ఒకే సంవ‌త్స‌రంలో నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా ఇందిర‌మ్మ ఇండ్ల కు శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. ఇందులో మ‌న నియోజ‌క వ‌ర్గానికి 3500 ఇండ్లు రాబోతున్నాయ‌న్నారు. అంతే కాదు 100 రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు క‌ల్పించి వారి కుటుంబాల‌లో సంతోషం నింపిద‌న్నారు. త్వ‌ర‌లో మెగా డీఎస్సీ ద్వారా 11 వేలకు పైగా టీచ‌ర్ పోస్టులు కూడా భ‌ర్తీ చేస్తుంద‌ని దానికి సంబంధించి నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల చేసింద‌న్నారు.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇత‌ర పార్టీల నుండి మ‌హామ‌హులు పార్టీలో చేరుతున్నార‌న్నారు.ప్ర‌స్తుతం మ‌రికొద్ది రోజుల్లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రానున్నాయ‌ని ఆ ఎన్నిక‌ల్లో అంద‌రం క‌లిసి ఎంపీని గెలిపించుకోవాల‌న్నారు. ఈసారి కేంద్రంలో కూడా త‌మ ప్ర‌భుత్వమే ఏర్ప‌డుతుంద‌ని ధీమాను వ్య‌క్తం చేసారు. అంతేకాదు రానున్న ఎన్నిక‌లేవైనా కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధుల గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని నాయ‌కులకు ,కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. అనంత‌రం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణం లోని సంజయ్ నగర్ కాలనీకి చెందిన పాటిల్ భూమా రెడ్డి, జైన‌థ్ మండ‌లం ఆకుర్ల గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ సునీత – దిలీప్ కంది శ్రీనివాస రెడ్డి స‌మ‌క్షం లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కండువాలు కప్పి కంది శ్రీనివాస రెడ్డి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి,పిప్పర్ వాడ ఎంపీటీసీ, భీంసరి ఎంపీటీసీ బిక్కి గంగాధర్, ప్రశాంత్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండి దేవిదాస్ చారి,రాజ్ మొహమ్మద్, బాయిన్ వార్ గంగా రెడ్డి,ఖ‌య్యుం,పత్తి ముజ్జు,రషీద్ ఉల్ హాక్,సయ్యద్ షాహిద్ అలీ, సుకేందర్,ఓరగంటి రఘు,మహేందర్ ,కోరేటి కిషన్, సుధాకర్ గౌడ్, సుకేందర్, వసంత్,పోతారెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *