సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆనందోత్సహాలతో పండగ జరుపుకోవాలి: కంది శ్రీనివాస రెడ్డి
ఆదిలాబాద్ ఈద్గా సందర్శన
* ముస్లీములకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
ముస్లీములకు అతి పవిత్రమైన బక్రీద్ సందర్భంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి పట్టణంలోని ఈద్గాను సందర్శించారు. ముస్లిములకు ప్రత్యేక ప్రార్ధనల అనంతరం వారిని కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా కంది శ్రీనివాస్ రెడ్డి త్యాగాలకు , ధర్మనిబద్ధతకు బక్రీద్ ప్రతీక అని అన్నారు. ముస్లీంలందరు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సహాల నడుమ బక్రీద్ జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా హిందూ ముస్లీంల మధ్య స్నేహ పూర్వక వాతావరణంలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయన్నారు. అందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని అల్లాను ప్రార్ధించాలన్నారు. రైతుల ఇంట పాడి పంటలతో సిరులు కురువాలని ఆకాంక్షంచారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మాజీ డీసీసీబీ అధ్యక్షులు ముడుపు దామోదర్ రెడ్డి, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, మావల ఎంపీపీ దర్శనాల సంగీత – ఏవన్, పత్తి ముజ్జు, ఎం.ఏ షకీల్, మొహమ్మద్ రఫీక్, ఖలీం, కయ్యుమ్, సమీ ఉల్లా ఖాన్, అఫ్రోజ్ అహ్మద్, రాజ్ మొహమ్మద్, కర్మ, అంజద్ ఖాన్, అఖిమ్,అస్బాత్ ఖాన్, తలా చౌష్,సయ్యద్ సుజాత్ అలీ, ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షులు రంగినేని శాంతన్ రావు,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, బండి దేవిదాస్ చారి, యెల్టీ భోజా రెడ్డి, సుధాగోని సుధాకర్ గౌడ్, ముడుపు ప్రశాంత్ రెడ్డి,డే రా కృష్ణ రెడ్డి, భరత్ వాగ్మారే, పోరెడ్డి కిషన్, తిరుమల్ రెడ్డి, రాజేశ్వర్, బూర్ల శంకరయ్య, కుర్ర నరేష్ తదితరులు ఉన్నారు.