సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఎవరు అధైర్యపడవద్దు… అండగా ఉంటా…
+ కార్యకర్తల సమావేశంలో కంది శ్రీనివాస రెడ్డి
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దని అందరికీ అందుబాటులో ఉంటూ, అండగా ఉంటానని ఆ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రజాసేవ భవన్ కార్యాలయంలో ఈ మేరకు కార్యకర్తలు, నాయకులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఎన్నికలు ఏవైనప్పటికీ కూడా గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఈ సదర్భంగా ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లి – బి గ్రామానికి చెందిన మనోహర్ కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాగా, ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.