సిరాన్యూస్, చిగురుమామిడి
కందుకూరి యాదగిరి కుటుంబానికి రూ.30వేలు అందజేసిన బాల్య మిత్రులు
చిన్ననాటి స్నేహితుడు అనారోగ్యంతో మరణించగా ఆ స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మంచి ఉద్దేశంతో తన బాల్య మిత్రులంతా కలిసి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన కందుకూరి యాదగిరి (36) జీవనోపాధికై హైదరాబాద్ లోని ఫార్మ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో కిడ్నీ సంబంధిత వ్యాధికి గురై ఇటీవల మృతి చెందారు.తన 2002 టెన్త్ క్లాస్ బ్యాచ్ బాల్య మిత్రులందరు కలిసి 30,000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని యాదగిరి కుటుంబ సభ్యులకు అందజేశారు.చిన్న వయసులో తండ్రిని కోల్పోయిన యాదగిరి కుమారులను చూసి బాధపడ్డారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జక్కుల బాబు, ముంజ ప్రకాష్, పోతరాజు మునీందర్, ములుపాల నరసయ్య, మూలపాల శ్రీనివాస్, దొబ్బల కిరణ్ కుమార్, తుంగ సదానందం పాల్గొన్నారు.