సిరాన్యూస్, జైనథ్
కాన్పమేడిగూడలో విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ కాన్పమేడిగూడ రోడ్ గ్రామంలోని జిల్లా, పరిషత్ ఉన్నత, మండల పరిషత్ పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవ సందర్భంగా విద్యార్థులకు పూల వర్షం కురిపిస్తూ ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య బడిలోకి వచ్చారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు నూతన బడి వస్త్రాలు అందజేశారు. ఆట పాటలతో, రంగు రంగుల ముగ్గులు వేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొనిగెల నారాయణ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సుజాత, మాజీ చైర్మన్ పోలవేణి అడేల్లు ఉపాధ్యాయురాలు జ్యోతి, వసుధ ,మంజుష, సంతోష్ ,దేవిదాస్, భావానీ ఆనంద్, ప్రకాష్ పెంటపర్తి ఊశన్న, భూమయ్య , గ్రామస్థులు మమత, రమేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.