సిరాన్యూస్, ఆదిలాబాద్
కప్లాయి వినోద్‌కు అభినందనలు వెల్లువ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మేరు సంఘం మండల కోశాధికారిగా ఎన్నికైన కప్లాయి వినోద్ ను రెగ్యులర్ వాకింగ్ టీం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. అనంతరం అభినందనలు తెలియజేసారు. రెగ్యులర్ వాకింగ్ టీం సభ్యుడు అయినా వినోద్ తలమడుగు మండల కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సభ్యులు అందరు కలిసి ఉదయం వాకింగ్ సమయంలో ఘనంగా సన్మానించారు. మరిన్ని ఉన్నత పదవులు పొందాలని మనసారా అభినందనలు తెలియజేశారు. అభినందన కార్యక్రమంలో పెంటపర్తి ఊశన్న, కూర పోచ్చన్న, మోరె వేంకటి, సూర్య వంశీ నాందేవ్, రాచర్ల నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.