సిరా న్యూస్, కోనారావుపేట:
కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలోని కనగర్తి గ్రామంలోని స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆదివారం సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేసారు. కాగా మొదటి స్థానంలో నిలిచిన మౌనిక, ద్వితీయ స్థానంలోని నిలిచిన స్వాతి, మూడవ స్థానంలో నిలిచిన సమతలకు కనగర్తి కరీంనగర్ డెయిరీ చైర్మన్ జిల్లెల లస్మారెడ్డి, పాలక వర్గం సభ్యులు బహుమతులు ప్రధానం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముగ్గుల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలను ప్రశంసించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు.