Karunakar: కరీంనగర్ ఎంపీ స్ఠానం ప్రవీణ్ రెడ్డికే కేటాయించాలి

సిరాన్యూస్‌, హుస్నాబాద్
కరీంనగర్ ఎంపీ స్ఠానం ప్రవీణ్ రెడ్డికే కేటాయించాలి
* కాంగ్రెస్ పార్టీ నాయకులు పచ్చునూరి కరుణాకర్
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పచ్చునూరి కరుణాకర్ మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ములుకనూరు సహకార సంఘం అధ్యక్షులుగా సుమారు 40ఏండ్లు రైతులకు సేవలందిన్న ఆయనకు సౌమ్యుడిగా పేరుంది. గతంలో హుజురాబాద్ పాత తాలూకాలో ప్రవీణ్ రెడ్డి తండ్రి విశ్వనాథ రెడ్డి సైతం రాజకీయాల్లో కొనసాగారు. తండ్రి బాటలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2009లో హుస్నాబాద్ ఎమ్మెల్యే గెలుపొంది ఎమ్మెల్యేగా ఆయన ప్రజల మన్ననలు పొందారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీటు కేటాయిస్తే తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *