Karunakar: సబ్ రిజిస్ట‌ర్ కార్యాల‌యాన్ని త‌ర‌లించొద్దు: అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్

సిరాన్యూస్, భీమదేవరపల్లి
సబ్ రిజిస్ట‌ర్ కార్యాల‌యాన్ని త‌ర‌లించొద్దు: అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్
* స‌బ్ రిజిస్ట‌ర్ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా

భీమదేవరపల్లి మండలంలోని సబ్ రిజిస్ట‌ర్ కార్యాల‌యాన్నితరలించవద్దని తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పచ్చునూరి కరుణాకర్ అన్నారు. గురువారం భీమదేవరపల్లి స‌బ్ రిజిస్ట‌ర్ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు దాదాపు 60 70 సంవత్సరాల చరిత్ర ఉంద‌న్నారు. గత ప్రభుత్వం హయంలో మండల కాంప్లెక్స్ లో స్థలం కేటాయించి బిల్లింగ్ సాంక్షన్ చేయించి పిల్లర్స్ వారికి పరిమితమైపోయింద‌ని తెలిపారు. 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోలేకపోయార‌ని వాపోయారు. అందుకే అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ ,మాజీ ఎంపీ వినోద్ కుమార్ సరైన నిధులు కేటాయించకపోవడంతో పిల్లర్స్ వరకే ఆగిపోవడం జరిగింద‌ని తెలిపారు. గతంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు 25 నుంచి 30 మండలాలు ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ చరిత్ర ఉన్నది, అలాంటి ఆఫీసును తరలించవద్దని డిమాండ్‌చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఖాళీగా ఉందని, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను గెస్ట్ హౌస్ లోకి మార్చాలని డిమాండ్ చేశారు..ఇప్పటికైనా బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సబ్ రిజిస్టర్ ఆఫీసుకు నిధులు కేటాయించాలని, ప్రభుత్వ ఆఫీసులో త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు చాగంటి వెంకటేశ్వర్లు, ఎల్కేపల్లి శ్రీనివాస్, ముడిదొడ్డి సదానందం, ఎలుక పెళ్లి ఆనందం, గుండేటి ప్రభాకర్ బిసి నాయకులు కొదురుపాక పోచయ్య, గూడెల్లి తిరుపతి రాకేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *