మాజీమంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపు
సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ దగ్గరలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ కు చేవెళ్ల బిఆర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హజరయ్యారు. సబిత మాట్లాడుతూ రానున్న ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మే 13న జరగబోయే ఎన్నికల్లోబిఆర్ఎస్ పార్టీ ఓట్లు వేసిఅభ్యర్థి ని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని బిజెపికి ఓటు వేయరాదని ఆమె పిలుపునిచ్చారు.