సిరాన్యూస్,ఓదెల
మండల సమైక్యకు కుర్చీలు వితరణ చేసిన కావటి జ్ఞానేశ్వరి
మండల సమైక్య మహిళ సభ్యురాలు చిరంజీవి కావటి జ్ఞానేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని మల్లికార్జున మండల సమైక్యకు 55 కుర్చీలు వితరణ చేశారు. ఈసందర్బంగా ఆమెను మండల సమాఖ్య పాలక వర్గం సభ్యులు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్త్రీ అనుకుంటే ఎలాంటి పనిలోనైనా ముందుండి చేస్తారని అన్నారు. కార్యక్రమంలో మండల సమాఖ్య పాలక వర్గం సభ్యులు రజిత, లలిత,జ్యోతి, ప్రేమలత ,ఏపీఎం లతా మంగేశ్వారి,సీసీ లు మారేళ్ళ శ్రీనివాస్,మల్లయ్య, ఓజ్జె కొమురయ్య, విజయ, రాజకుమారి,ఆపరేటర్ పవన్, అకౌంటెంట్ భవాని లతో పాటు అన్ని గ్రామ సంఘాల అధ్యక్షులు ,విఓఏ లు తదితరులు పాల్గొన్నారు.