సిరాన్యూస్, ఓదెల
తెల్ల దొరాలను తరిమి కొట్టిన మహా మేధావి గాంధీ: గవర్నర్ అవార్డు గ్రహీత రవీంద్రా చారి
జాతిపిత గాంధీజీ పుట్టినరోజున సందర్బంగా ప్రత్యేకమైన కవిత ……
మోహన్ దాస్ కరం చంద్ గాంధీ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్ముడు…
ఆ హింస మార్గంతో బ్రిటిష్ తెల్ల దొరాలను తరిమి కొట్టిన మహా మేధావి…
ఉప్పు సత్యాగ్రహం కోసం 24 రోజులపాటు దండియాత్ర కు నడి చిన ధర్మాత్ముడు మహాత్ముడు…
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొన్న దీశాలి గాంధీజీ…
సామాన్యులలో సామాన్యుడిగా జీవించిన అసమాన్యుడు బాపూజీ…
అహింస మార్గంతో దేశ ప్రజలకు బాట చూపినవాడు గాంధీజీ..
గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం నా దేశం భారతదేశం…
తరతరాల చరిత్రలో గాంధీజీ కలలు అన్న ఈ దేశం కలగానే మిగిలి పోయింది…
నిరుద్యోగ వ్యవస్థ నీడలాగా వెంటాడుతుంది .గాంధీజీ నడిచిన నేలపైనే అవినీతిపై అద్దాలమేడలు కడుతున్నారు…
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఉన్న విలువ ఏది? గాంధీజీ పుట్టిన గడ్డపైనే పేదరిక నిర్మూలన పేదలకే అంకితం చేస్తున్నారు…
రచన: బ్రా హ్మండ్లపల్లి రవీంద్రా చారి (కవి. రచయిత)
గవర్నర్ అవార్డు గ్రహీత , జిల్లా పెద్దపల్లి, ఓదెల 9989464261