Kavvampally Satyanarayana: ఘ‌నంగా సీతారామ కళ్యాణం:  హాజ‌రైన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

సిరాన్యూస్,శంకరపట్నం
ఘ‌నంగా సీతారామ కళ్యాణం:  హాజ‌రైన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో బుధ‌వారం నిర్వ‌హించిన శ్రీ వాలీసుగ్రీవ సీతారామ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ హాజర‌య్యారు.ఈసంద‌ర్బంగా స్వామి వారిని దర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంతరం ముత్తారం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవానికి హాజరై అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వ‌హించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *