సిరా న్యూస్, కరీంనగర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.కేసిఆర్ తెలంగాణను సాధించిన గొప్ప యోధుడని కొనియాడారు.కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.