సిరా న్యూస్,బేల
తెలంగాణను సాధించిన గొప్ప యోధుడు కేసీఆర్
* మండల బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ప్రమోద్ రెడ్డి
* ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణను సాధించిన గొప్ప యోధుడు కేసీఆర్ అని మండల బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ప్రమోద్ రెడ్డి అన్నారు. శనివారం
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇంద్ర శేఖర్ మస్కే తేజ్ రావ్ గోడే. మధుకర్, సతీష్ పవర్ . విపిన్ ఖోడే. జక్కుల మధుకర్ తదితరులు పాల్గొన్నారు.