సిరా న్యూస్,హైదరాబాద్;
పీసీసి అధికార ప్రతినిధి భవాని రెడ్డి, స్పోక్స్ పర్సన్స్ కేఎస్వీ చారి,లింగం యాదవ్లు మీడియాతో మాట్లాడారు.
భవాని రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టినా కేటీఆర్ కు ఇంకా బుద్ధి రాలేదు. లిక్కర్ కేసులో కవితకు బెయిల్ రాలేదని ఆందోళనలు కేటీఆర్, కేసీఆర్ ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల కు పాల్పడింది ముందు బీఆర్ఎస్ పార్టీనే కదా. పిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు విద్యార్థులను,నిరుద్యోగులను రెచ్చ గొట్టి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం అడుతున్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అనవసరంగా టైం వెస్ట్ చేసుకోకుండా పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని నిరుద్యోగుల విజ్ఞప్తి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరునెలల్లో నే 30 వేల ఉద్యోగాలు చేపట్టిందని అన్నారు.
కేఎస్వీ చారి మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై బిజెపి నేతల ట్రోల్ బాధాకరం. ఆయన ఏ ఒక్క మతాన్ని ఉద్దేశించి మాట్లాడలేదు. దేశంలో ఒక మతాన్ని దూరం చేసే కుట్ర జరుగుతుంది. ఈ దేశం మతాన్ని ప్రోత్సహిస్తే మనకు,అంబేద్కర్,అబ్దుల్ కలాం లాంటి గొప్ప నేతలు దొరికే వారా? మతం పేరుతో బీజేపీ దేశాన్ని ఎలుతుంది. దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం పణంగా పెట్టింది. విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలతో బిజెపి,బీఆర్ఎస్ లు అడుకుంటున్నాయని ఆరో్పించారు.
లింగం యాదవ్ మాట్లాడుతూ నిరుద్యోగుల పేరుతో బీజేపీ,బిఆరెస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన నడుస్తుంది. పది ఏండ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చర్చకు సిద్ధమా. బీఆర్ఎస్ హాయంలో 16 పేపర్లు లీక్ అయ్యాయి. ఏ సమస్యలైన ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఉద్యోగాలు అడిగితే పకోడీ అన్న చరిత్ర బిజెపి ది. దేశంలో అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నవి. ఏదైనా ఉంటే ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు. విద్యార్థుల పేరుతో రాజకీయాలు చేయొద్దని అన్నారు.
======================