రేవంత్‌కు సవాల్ విసరబోతున్న కేసీఆర్..

సిరా న్యూస్,హైదరాబాద్;
కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను ఫీల్డులోకి వస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. భూపాలపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు తప్పకుండా వస్తానని వారికి హామీ ఇచ్చారు.చాలా కాలం తరువాత కేసీఆర్ ఫొటో పేపర్లలో కనిపించింది. కేసీఆర్ మాటలు మీడియాలో వినిపించాయి. కేసీఆర్ వ్యాఖ్యలు పేపర్లలో ప్రచురితమయ్యాయి. కొన్ని నెలల తరువాత కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడుతున్నట్లు వీడియోలు, ఫొటోలు బయటకు రావడంతో ఆయన అభిమానుల్లో సంతోషం కనిపించింది. నిన్న పాలకుర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే.. ఒకప్పుడు సింహంలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే కేసీఆర్‌ను నిన్న చాటుమాటుగా వీడియో తీస్తూ పోస్ట్ చేశారు. అయితే.. ఎవరో ఓ కార్యకర్త చాటుమాటుగా ఈ వీడియో తీసి పోస్ట్ చేసినట్లుగా కనిపించింది.కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను ఫీల్డులోకి వస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. భూపాలపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు తప్పకుండా వస్తానని వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. కూల్చేందుకే ప్రజలు కాంగ్రెస్ అధికారాన్ని ఇచ్చారా అని నిలదీశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈ టైమ్ పాస్ ముచ్చట్లు ఏందని నిలదీశారు. బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ కేసులకు భయపడవద్దని, జైళ్లకూ బెదరవద్దని పిలుపునిచ్చారు. లోపలేస్తాం.. కూలగొడతాం.. ప్రభుత్వంలో వారు మాట్లాడే మాటలు ఇవేనా అని ప్రశ్నించారు. ‘మేం తిట్టలేమా.. మేం తిట్టడం స్టార్ట్ చేస్తే ఈ రోజు మొదలు పెడితే రేపటివరకూ తిట్టగలం’ అని హెచ్చరించారు. అయితే.. ప్రజల్లోకి వస్తానని కేసీఆర్ చెప్పడంతో ఇక బీఆర్ఎస్ ఫ్యామిలీలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. మరోవైపు.. కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మం కూడా వేరే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రేవంత్ తన దూకుడును పెంచారు. రోజురోజుకూ పెంచుతూనే ఉన్నారు. అటు కేటీఆర్‌ను సైతం అరెస్టు చేస్తారన్న ప్రచారం మరింత జోరందుకుంది. మరోవైపు రేవంత్ దూకుడు ముందు కేటీఆర్, హరీశ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారని టాక్ ఉంది. కేటీఆర్ రేవంత్ రెడ్డికి తగిన స్థాయిలో కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారనే టాక్ ఉంది. ఈ క్రమంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా లేదా అన్న ఆసక్తి కూడా నెలకొంది. ఒకవేళ కేటీఆర్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉండడంతోనే కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారా అన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.చాలా సందర్భాల్లో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాళ్లు విసిరారు. అసెంబ్లీకి రావాలని తొడగొట్టారు. కానీ.. కేసీఆర్ మాత్రం ఏనాడూ అసెంబ్లీకి వచ్చిందిలేదు. దాంతో బీఆర్ఎస్ రేవంత్‌తో పోటీపడలేకపోయిందన్న వాదనలూ వినిపించాయి. అయితే.. రేవంత్‌కు ఇక నుంచి అలాంటి అవకాశం ఇవ్వొద్దనే కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. మరోవైపు.. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశాలు సైతం ఉన్నట్లుగా ప్రచారం వినిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్‌ కన్నా హరీశ్ రావే యాక్టివ్‌లో ఉన్నారు. అయితే.. ఇన్ని రోజులు కేటీఆర్‌కు చాన్స్ ఇవ్వడానికే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారని, ఇప్పుడు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. సంక్రాంతి తరువాత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *