సిరా న్యూస్, ఇంద్రవెల్లి:
నాగోబా భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి…
-ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటెల్…
నాగోభా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామం దర్బార్ హలులో నాగోబా జాతర ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఎ పిఓ కుశ్బూ గుప్తా లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జాతరలో తాగు నీటి వసతి కల్పించాలన్నారు. జాతరలో వెలిసే దుకాణాలలోనీ తినుబండారాల్లో నాణ్యత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్వరలో మెస్రం వంశీయులను సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులతో వద్దకు తీసుకెళ్తామని అన్నారు. నాగోబా ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అధికారులంత సమన్వయముతో పనిచేసి నాగోబా జాతరను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అధికారులతో కలసి జాతర ఏర్పాట్లు పరిశిలించారు.